Jaggareddy: పాత మిత్రులతో కలిసి జగ్గారెడ్డి స్టెప్పులు.. సంగారెడ్డిలో సంక్రాంతి సందడి
సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డిలో రాజకీయ సందడి నెలకొంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దంపతులు పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగారెడ్డిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జగ్గారెడ్డి తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సందడి చేశారు.

- పతంగులు ఎగురవేసి, డాన్స్ చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి: సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డిలో రాజకీయ సందడి నెలకొంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దంపతులు పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగారెడ్డిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జగ్గారెడ్డి తన చిన్ననాటి స్నేహితులతో కలిసి సందడి చేశారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారితో కలిసి పతంగులు ఎగురవేసి అలరించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి తన స్నేహితులతో పాటు భార్య నిర్మలా జగ్గారెడ్డితో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. రాజకీయ ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టి సాధారణ వ్యక్తిలా పండుగ జరుపుకుంటున్న జగ్గారెడ్డిని చూసి కార్యకర్తలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి అంటేనే ఆత్మీయ కలయిక అని, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు.



