తెలంగాణసంగారెడ్డి

Sangareddy:ముగ్గుతో మేల్కొలుపు.. కానిస్టేబుల్ వనజ ‘చైతన్య’ రంగవల్లిక!

ముగ్గు అంటే కేవలం రంగుల కలయిక మాత్రమే కాదు.. అది సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన ఆయుధమని నిరూపించారు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వనజ.

జహీరాబాద్ (కందిలి): ముగ్గు అంటే కేవలం రంగుల కలయిక మాత్రమే కాదు.. అది సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన ఆయుధమని నిరూపించారు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వనజ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆమె తీర్చిదిద్దిన రంగవల్లిక ఇప్పుడు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

సామాజిక స్పృహతో సంప్రదాయం: పోలీస్ స్టేషన్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొన్న వేళ, వనజ తన కళాత్మకతకు సామాజిక బాధ్యతను జోడించారు. కేవలం గీతలు, చుక్కలతో సరిపెట్టకుండా, సమాజంలో నేడు అత్యంత అవసరమైన అంశాలను తన ముగ్గులో ప్రతిబింబించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. పక్షులకు, మనుషులకు ప్రాణసంకటంగా మారిన ‘చైనా మాంజా’ను వాడరాదని హెచ్చరించారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్ల కలిగే అనర్థాలను ముగ్గు ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపారు.

అధికారుల ప్రశంసలు..

తెలుగు సంస్కృతిని కాపాడుతూనే, చట్టాలు, భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వనజ చేసిన ఈ ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు. సంప్రదాయ పండుగలు సామాజిక విలువల పెంపునకు వేదికలు కావాలని ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *