తెలంగాణసంగారెడ్డి

ముంగిళ్లలో రంగుల కేళి.. ముబారస్ పూర్ లో ముగ్గుల పోటీ!

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

దౌల్తాబాద్ (కందిలి): సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకొని స్థానిక శివాలయం ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గ్రామ మహిళలు, యువతులు పోటాపోటీగా రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్ది తమ ప్రతిభను చాటారు.

బహుమతుల సందడి
గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

ప్రథమ బహుమతి: ఎయిర్ కూలర్

ద్వితీయ బహుమతి: గ్రైండర్ మిక్సీ

తృతీయ బహుమతి: రైస్ కుక్కర్

స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల సంప్రదాయాలు కలకాలం నిలుస్తాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌తో పాటు మాజీ ఎంపీటీసీ తిరుపతి, రామచంద్రం, లక్ష్మణ్, సతీష్, బాలాజీ తదితరులు పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *