Free Camp: లక్షల ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీ ఇక ఉచితం.. హైదరాబాద్లో అమెరికా డాక్టర్ల వైద్య శిబిరం.. పూర్తి వివరాలు ఇవే!
పేద ప్రజలకు అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీ వైద్యం అందించేందుకు అఖిల రాజ్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.

పేద ప్రజలకు అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీ వైద్యం అందించేందుకు అఖిల రాజ్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రముఖ అమెరికా ప్లాస్టిక్ సర్జరీ నిపుణుల నేతృత్వంలో హైదరాబాద్ వేదికగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ మండల అధ్యక్షులు కోరే శేఖర్ వెల్లడించారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ లో ఈ శిబిరానికి సంబంధించిన గోడపత్రికను ఆయన విడుదల చేశారు.
శిబిరం ఎక్కడ? ఎప్పుడు?
హైదరాబాద్లోని ఓల్డ్ మల్లేపల్లి, సీతారాం బాగ్ నందున్న డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్ లో ఈ శిబిరం జరగనుంది.
తేదీలు: జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4, 2026 వరకు.
వైద్యులు: అమెరికాకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు బాధితులకు శస్త్రచికిత్సలు చేస్తారు.
ఎవరెవరు అర్హులు?
సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ అంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. కానీ ఈ శిబిరంలో ఈ క్రింది సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా సర్జరీ నిర్వహిస్తారు:
గ్రహణ మొర్రి (Cleft Lip) తో పుట్టిన పిల్లలు/పెద్దలు.
అగ్ని ప్రమాదాల వల్ల కాలిన గాయాల మచ్చలు ఉన్నవారు.
కరెంట్ షాక్ వల్ల చర్మం దెబ్బతిన్న బాధితులు.
ఇతర ప్రమాదాల వల్ల ముఖం లేదా శరీరంపై ప్లాస్టిక్ సర్జరీ అవసరమైన పేదలు.
పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ ఉచిత సర్జరీల కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు లేదా బాధితులు 9949691182 లేదా 9908010610 ఫోన్ నంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు విజయ్, కర్ణాకర్, యాదగిరి, స్వామి, పాషా, పర్శరాములు తదితరులు పాల్గొని, గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులకు ఈ సమాచారం చేరవేసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు.



