తెలంగాణసంగారెడ్డి
Sadashivpet: సదాశివపేట మున్సిపల్ పోరు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్!
సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది.

సంగారెడ్డి: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. మొత్తం 26 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ తమ అభ్యర్థుల కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో 8 మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.
ప్రకటించిన అభ్యర్థుల వివరాలు:
- వార్డ్ 2: పాండు నాయక్
- వార్డ్ 5: రజియా బేగం
- వార్డ్ 6: నాగుల విజయ్
- వార్డ్ 10: సాతాని శ్రీశైలం
- వార్డ్ 15: నాసిర్
- వార్డ్ 17: కమిల్ అన్సార్
- వార్డ్ 20: ఆకుల మంజుల శివకుమార్
- వార్డ్ 22: వడ్ల మహేశ్వరి వీరేశం
మిగిలిన వార్డులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ఎంపికలో స్థానిక బలాబలాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.



