Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ పోరు.. 32 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన
సంగారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ అధికారికంగా విడుదల చేశారు.

సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో సంగారెడ్డిలో రాజకీయ సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థుల తొలి జాబితాను శాసనసభ్యులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, చింతా ప్రభాకర్ అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 40 వార్డులు ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుతం 32 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పటోళ్ల శశిధర్ రెడ్డి గారు, ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు గారు, పట్టణ అధ్యక్షులు రాస వెంకటేశ్వర్లు గారు, కార్యదర్శి నరసింహులు గారు, మాజీ సిడిసి చైర్మన్ బుచ్చి రెడ్డి గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి గారు, హాకీమ్ గారు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన 8 వార్డుల అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా చింత ప్రభాకర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
వార్డ్ నంబర్ 1 – దండు నర్సిములు
వార్డ్ నంబర్ 3 – నంద నాయకుల నరసింహారాజు
వార్డ్ నంబర్ 4 – కసిని శ్రీకాంత్
వార్డ్ నంబర్ 5 – షాజిదా బేగం (W/o యూనిస్ బేగ్)
వార్డ్ నంబర్ 7 – మొగుళ్ళ శరత్ యాదవ్
వార్డ్ నంబర్ 8 – కర్రే సురేష్
వార్డ్ నంబర్ 9 – లాడే శిరీష (W/o బాలు)
వార్డ్ నంబర్ 10 – ప్యాట విటల్ రెడ్డి
వార్డ్ నంబర్ 11 – పొన్న దశరథ్ రెడ్డి
వార్డ్ నంబర్ 12 – పొన్న రాజేందర్ రెడ్డి
వార్డ్ నంబర్ 14 – అల్లూరి లక్ష్మణ్
వార్డ్ నంబర్ 16 – కొత్తపల్లి శ్రీకాంత్
వార్డ్ నంబర్ 17 – నౌషిన్ (W/o ఎండి మున్ను)
వార్డ్ నంబర్ 18 – దుర్గాల లక్ష్మి
వార్డ్ నంబర్ 19 – చాకలి స్వప్న (W/o నర్సింలు)
వార్డ్ నంబర్ 20 – గౌసియా బేగం
వార్డ్ నంబర్ 22 – మున్నూరు విష్ణువర్ధన్
వార్డ్ నంబర్ 23 – ఎం.ఆర్. మనోరంజని (W/o వెంకటేశ్వర్లు)
వార్డ్ నంబర్ 24 – అరిఫా బేగం
వార్డ్ నంబర్ 25 – అంజుమ్ (W/o ఎండి అజ్జు)
వార్డ్ నంబర్ 26 – ఎండి జీషన్ పర్వేజ్
వార్డ్ నంబర్ 27 – నక్క మంజులత (W/o నాగరాజు గౌడ్)
వార్డ్ నంబర్ 28 – కాశిపురం లక్ష్మి (W/o గంగయ్య)
వార్డ్ నంబర్ 29 – బేగరి శ్రీకాంత్
వార్డ్ నంబర్ 31 – శంకరి విజేందర్ రెడ్డి
వార్డ్ నంబర్ 32 – నాయకోటి అశ్విని (W/o నవీన్ కుమార్)
వార్డ్ నంబర్ 33 – ఆర్.వి. గోవర్ధన్ నాయక్
వార్డ్ నంబర్ 34 – షబానా బేగం
వార్డ్ నంబర్ 35 – శంకరన్నోల్ల శైలజ (D/o మల్లేశం)
వార్డ్ నంబర్ 36 – లాడే మనీలా (W/o మల్లేశం)
వార్డ్ నంబర్ 37 – బలవంతుల జలేందర్ రావు
వార్డ్ నంబర్ 38 – ఎండీ జాఫర్



