తెలంగాణసంగారెడ్డి

సాధువు ముసుగులో గంజాయి సాగు

సాధువు, గుడి పూజారి ముసుగులో గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగామ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది

-685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి స్వాధీనం
-రూ.70 లక్షల విలువ అంచనా

కందిలి, సంగారెడ్డి
సాధువు, గుడి పూజారి ముసుగులో గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని డీటీఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగామ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామ దేవాలయంలో పూజారిగా, పరిసర గ్రామాల్లో నర్సయ్య మహారాజ్గా చెలామణి అవుతున్న వ్యక్తి దేవాలయ ప్రాంగణంలో పూల తోట పేరుతో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్, ఎస్సైలు హన్మంత్, అనుదీప్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 కేజీల గంజాయి విత్తనాలు, రూ.30 వేల నగదు, వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడు చాలాకాలంగా గంజాయి సాగు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నర్సయ్య మహారాజ్‌ను అరెస్టు చేసి నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న డీటీఎఫ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *