తెలంగాణలో కళ్యాణ్ జువెలర్స్ విస్తరణ.. మేడిపల్లిలో నూతన షోరూమ్ ప్రారంభం
తెలంగాణలో తమ ఉనికిని బలోపేతం చేస్తూ కళ్యాణ్ జువెలర్స్ మేడిపల్లిలో నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను ఏప్రిల్ 12 ఆదివారం నాడు నటి శ్రీలీల ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో కళ్యాణ్ జువెలర్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది.

మేడిపల్లి: నగల రిటైల్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కళ్యాణ్ జువెలర్స్ తెలంగాణలో తన ఉనికిని వ్యూహాత్మకంగా విస్తరిస్తూ మేడిపల్లిలోని వరంగల్ హైవేలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ భారీ షోరూమ్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 12 ఆదివారం ఉదయం 11:30 గంటలకు జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభించనున్నారు. తాజా విస్తరణ ద్వారా రాష్ట్రంలో కళ్యాణ్ జువెలర్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
మేడిపల్లి పరిసర ప్రాంతాల వినియోగదారులకు నమ్మకమైన నగల షాపింగ్ అనుభవాన్ని మరింత దగ్గర చేస్తూ తెలంగాణలో తన విస్తరణలో భాగంగా కళ్యాణ్ జువెలర్స్ మరో మైలురాయిని అధిగమించింది. ఈ కొత్త షోరూమ్‌లో వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా సాంప్రదాయ కళానైపుణ్యం, ఆధునిక డిజైన్ల కలయికతో రూపొందించిన బంగారం, వజ్రాలు, విలువైన రత్నాల ఆభరణాల విస్తృత శ్రేణిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా మేడిపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తమ సేవలను మరింత చేరువ చేస్తూ సంస్థ తన నిబద్ధతను చాటుకుంది.
తెలంగాణలో మా విస్తరణ వ్యూహం కళ్యాణ్ జువెలర్స్ పై ఉన్న నమ్మకమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు మరింత దగ్గర చేయాలనే నిబద్ధతతో కొనసాగుతోందని కళ్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేడిపల్లి… నాణ్యమైన పనితనం మరియు ఆధునిక ఆభరణాలను ఆదరించే బలమైన మార్కెట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త షోరూమ్ ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు మా బ్రాండ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కళ్యాణ్ జువెలర్స్ కు గుర్తింపునిచ్చే నమ్మకం పారదర్శకత మరియు విశిష్టమైన సేవలతో పాటు విభిన్న శ్రేణి డిజైన్లను అందించడమే మా లక్ష్యమని ఆయన వివరించారు.
షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కళ్యాణ్ జువెలర్స్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ కూలిపై(Making Charges) 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అదనంగా వెండి ఆభరణాలపై నేరుగా 10 శాతం తగ్గింపు మరియు వెండి వస్తువుల మేకింగ్ ఛార్జీలపై 25 శాతం తగ్గింపును కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇవన్నీ షాపింగ్‌కు ఇదే సరైన సమయమని తెలియజేస్తున్నాయి. వీటితో పాటు మార్కెట్లోనే అత్యల్ప ధరతో పాటు అన్ని కళ్యాణ్ షోరూమ్‌లలో ఒకే విధంగా ఉండే ప్రత్యేక గోల్డ్ బోర్డ్ రేటును పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంచారు. ఇది కొనుగోలుదారులకు ధరల విషయంలో పూర్తి పారదర్శకతను, అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
కళ్యాణ్ జువెలర్స్ విక్రయించే ప్రతి ఆభరణం బీఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉండటంతో పాటు అనేక ప్యూరిటీ పరీక్షలకు లోబడి ఉంటుంది. దీనికి తోడు వినియోగదారులకు కళ్యాణ్ జువెలర్స్ 4 లెవల్ అస్యూరెన్స్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇది బంగారు స్వచ్ఛతకు హామీ ఇవ్వడమే కాకుండా జీవితకాల ఉచిత మెయింటెనెన్స్ మరియు ఆభరణానికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. అలాగే పారదర్శకమైన ఎక్స్ఛేంజ్ మరియు బై బ్యాక్ పాలసీలను కూడా కలిగి ఉంటుంది. ఇది తమ బ్రాండ్ పై ఉన్న నమ్మకాన్ని మరియు వినియోగదారుల పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటి చెబుతోంది.
ఈ నూతన షోరూమ్‌లో కళ్యాణ్ జువెలర్స్ కి చెందిన ప్రముఖ బ్రాండ్ల కలెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెళ్లి వేడుకల కోసం ముహూర్, చేతితో రూపొందించిన ప్రాచీన శైలి ముద్ర, ఆలయ నగల శైలిలో నిమః(Nimah), డ్యాన్సింగ్ డైమండ్స్ గ్లో మరియు సొలిటైర్ తరహా వజ్రాల నగలు జియా(Ziah) వంటి రకాలు ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటు అన్‌కట్ డైమండ్స్ అనోఖి, ప్రత్యేక సందర్భాల కోసం అపూర్వ, వివాహ వేడుకల వజ్రాల నగలు అంతర, రోజువారీ అవసరాలకు హేరా, విలువైన రత్నాల ఆభరణాలు రంగ్ మరియు ఈ మధ్యే విడుదల చేసిన రంగురాళ్లు మరియు వజ్రాల కలెక్షన్ లీలా వంటి బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయి.



