తెలంగాణ

మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్‌ను ప్రారంభించిన నటి శ్రీలీల

ఈ ప్రారంభోత్సవం సంప్రదాయం, ట్రెండ్‌ను ఒకచోట చేర్చి ఆభరణాల కొనుగోలులో వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందిస్తుంది

మేడిపల్లి, ఏప్రిల్ 12, 2026: ఆభరణాల రంగంలో అగ్రగామి సంస్థ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ తెలంగాణలో తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని మేడిపల్లిలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను సినీ నటి శ్రీలీల ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవం తెలంగాణ మార్కెట్ పట్ల కళ్యాణ్ జ్యువెలర్స్ కట్టుబాటును తెలియజేస్తోంది. సంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక షాపింగ్ అనుభవంతో మేళవించి వినియోగదారులకు ఇక్కడ అత్యుత్తమ రిటైల్ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ షోరూమ్‌లో బ్రాండ్‌కు చెందిన సిగ్నేచర్ హౌస్ లేబుల్స్‌తో పాటు అనేక రకాల అద్భుతమైన ఆభరణాల సేకరణ అందుబాటులో ఉంది.

ఈ సందర్భంగా టాలీవుడ్ నటి శ్రీలీల మాట్లాడుతూ.. “కళ్యాణ్ జ్యువెలర్స్‌కి చెందిన ఈ అందమైన షోరూమ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నమ్మకం మరియు పారదర్శకతతో పాటు కస్టమర్లకు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్రాండ్ విధానం నాకు ఎంతగానో ఇష్టం. కళ్యాణ్ జ్యువెలర్స్ నాణ్యత మరియు నైపుణ్యంలో నిరంతరం ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతోంది. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మేడిపల్లి వాసులకు ఆభరణాల అవసరాల కోసం ఈ అద్భుతమైన షోరూమ్ అందుబాటులోకి రావడంపై సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు.

షోరూమ్ ప్రారంభం గురించి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. “తెలంగాణలో మా ఉనికిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మేడిపల్లిలో ఈ నూతన షోరూమ్‌ను ప్రారంభించడం కీలకమైన మైలురాయి. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు గుర్తింపు తెచ్చిన వైవిధ్యమైన డిజైన్లతో పాటు నాణ్యత మరియు పారదర్శకమైన సేవలను ఈ ప్రాంత ప్రజలకు మరింత దగ్గర చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను ఆహ్వానిస్తూ వారి ప్రత్యేక సందర్భాలు మరియు వేడుకలలో భాగం కావాలని కోరుకుంటున్నాం” అని ఆయన తెలిపారు.

షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంగా కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారం మరియు వజ్రాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 50 శాతం వరకు ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. దీనితో పాటు వెండి ఆభరణాలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ మరియు వెండి వస్తువుల తయారీ కూలీపై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. వినియోగదారులకు గరిష్ట ధర, పారదర్శకతను అందించే లక్ష్యంతో మార్కెట్‌లో అత్యంత తక్కువగా ఉండే స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేట్ కూడా పరిమిత కాలం పాటు అన్ని కళ్యాణ్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

కళ్యాణ్ జ్యువెలర్స్‌లో విక్రయించే అన్ని ఆభరణాలు బిఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉండటమే కాకుండా అనేక స్వచ్ఛత పరీక్షలకు లోబడి ఉంటాయి. దాంతోపాటు వినియోగదారులు కళ్యాణ్ జ్యువెలర్స్ 4-లెవల్ అస్యూరెన్స్ సర్టిఫికేట్‌ను పొందుతారు. ఇది బంగారు స్వచ్ఛత, ఉచిత లైఫ్ టైమ్ మెయింటెనెన్స్, వివరణాత్మక ఉత్పత్తి సమాచారం, పారదర్శకమైన ఎక్స్ఛేంజ్ మరియు బై-బ్యాక్ పాలసీలకు హామీ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ నమ్మకం, పారదర్శకత పట్ల బ్రాండ్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కి చెందిన ప్రముఖ హౌస్ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో వివాహ ఆభరణాల శ్రేణి ‘ముహూరత్’, చేతితో రూపొందించిన యాంటిక్ ఆభరణాలు ‘ముద్ర’, టెంపుల్ జ్యువెలరీ ‘నిమః'(Nimah), డ్యాన్సింగ్ డైమండ్స్ ‘గ్లో’, సాలిటైర్ తరహా వజ్రాల ఆభరణాలు ‘జియా’, అన్‌కట్ డైమండ్స్ ‘అనోఖి’, ప్రత్యేక సందర్భాల కోసం ‘అపూర్వ’, వెడ్డింగ్ డైమండ్స్ ‘అంతర’, రోజువారీ వాడకానికి ‘హేరా’, విలువైన రాళ్ల ఆభరణాలు ‘రంగ్’ మరియు ఇటీవల ప్రారంభించిన కలర్డ్ స్టోన్స్ మరియు డైమండ్ జ్యువెలరీ ‘లీల’ వంటివి కొలువుదీరాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *