తెలంగాణ

జేఈఈ మెయిన్ 2026: అలెన్(ALLEN) హైదరాబాద్ విద్యార్థికి 100 పర్సంటైల్

  • అలెన్ హైదరాబాద్ క్లాస్‌రూమ్ విద్యార్థి రిషి ప్రేమ్‌నాథ్‌కు ఆల్ ఇండియా 8వ ర్యాంక్

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో అలెన్ హైదరాబాద్ విద్యార్థి రిషి ప్రేమ్‌నాథ్ అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 8వ ర్యాంక్ (AIR-8) సాధించడంతో పాటు 100 పర్సంటైల్ స్కోరును సొంతం చేసుకున్నాడు.

అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ సౌత్ జోన్, జోనల్ హెడ్, మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. అలెన్ హైదరాబాద్ సెంటర్ విద్యార్థి రిషి ప్రేమ్‌నాథ్ జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించారని, దక్షిణ భారతదేశంలోని అలెన్ సెంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఇతనే అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. అలెన్ హైదరాబాద్ సెంటర్‌కు చెందిన మరో విద్యార్థి సామవేదం రఘు కపిష్ అక్షిత్ కూడా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఇతడు 99.9976982 పర్సంటైల్‌తో జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 76వ ర్యాంక్ (AIR-76) సాధించాడు.

అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ హెడ్ సౌరవ్ తివారీ మాట్లాడుతూ.. అలెన్ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి నియువ్ కొచేటా(Niuv Kocheta) 99.9962271 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 104వ ర్యాంక్ సాధించి మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఫలితాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని, అలెన్ హైదరాబాద్ సెంటర్ నుండి మరిన్ని టాప్ ర్యాంకులు, అత్యుత్తమ పర్సంటైల్‌లు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. “ఈ ఘనత మా విద్యార్థుల అంకితభావానికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి మరియు మా అధ్యాపకుల అవిశ్రాంత కృషికి నిదర్శనం” అని కొనియాడారు. ఈ అద్భుత విజయాన్ని అలెన్ హైదరాబాద్ ప్రతినిధులు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. ఇది నగరానికే గర్వకారణమని వారు సంతోషం వ్యక్తం చేశారు.

రిషి ప్రేమ్‌నాథ్ తన విజయంపై మాట్లాడుతూ.. “జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో 100 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 8వ ర్యాంక్ సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నా విజయానికి ప్రధాన కారణం అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ – హైదరాబాద్‌లో నాకు లభించిన క్రమబద్ధమైన గైడెన్స్, తిరుగులేని సపోర్ట్. ఇక్కడి అధ్యాపకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి అంశాన్ని కేవలం కంఠస్థం చేయడం కంటే స్పష్టంగా అర్థం చేసుకునేలా ఎంతో కృషి చేశారు” అని తెలిపారు.

నేషనల్ ఫలితాల గురించి అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ నితిన్ కుక్రేజా(Nitin Kukreja) మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో అలెన్ మరోసారి తన విద్యా ప్రతిభను నిరూపించుకుందని తెలిపారు. అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మొత్తం నలుగురు రెగ్యులర్ క్లాస్‌రూమ్ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకుల్లో నిలిచారని పేర్కొన్నారు. వీరిలో కబీర్ చిల్లర్ 100 పర్సంటైల్ స్కోరుతో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ (AIR-1) సాధించాడని వెల్లడించారు. అలెన్ రెగ్యులర్ క్లాస్‌రూమ్ విద్యార్థులైన అర్నవ్ గౌతమ్ ఆల్ ఇండియా 5వ ర్యాంక్ (AIR-5), శుభమ్ కుమార్ 6వ ర్యాంక్ (AIR-6) మరియు రిషి ప్రేమ్‌నాథ్ 8వ ర్యాంక్ (AIR-8) సాధించారని ఆయన వివరించారు. ఫలితాల విషయంలో తమ విశ్వసనీయతను మరియు పారదర్శకతను కాపాడుకుంటూ, అలెన్ తన ఫలితాలను దేశంలోని అగ్రశ్రేణి ఆడిట్ సంస్థలలో ఒకటైన ఈవై ఇండియాతో(EY India) మరోసారి ధ్రువీకరించుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *