తెలంగాణ

సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 2026 సస్టైనబుల్ సిమెంట్ తయారీలో పురోగతి

తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన సిమెంట్ భవిష్యత్తు కోసం సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 2026 కృషి చేస్తోంది

హైదరాబాద్, మే 14, 2026: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సిమెంట్ పరిశ్రమ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక కాన్ఫరెన్స్ మరియు ఎక్స్‌పో ‘గ్రీన్ సిమెంటెక్’ 22వ ఎడిషన్ ఇవాళ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ప్రారంభమైంది

గ్రీన్ బిజినెస్ సెంటర్ (సీఐఐ-జీబీసీ), సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ), ఇండియాతో కలిసి సీఐఐ నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో 400 మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో విధాన నిర్ణేతలు, సీనియర్ పరిశ్రమ నాయకులు, సాంకేతికతను అందించేవారు, విద్యా మరియు పరిశోధనా సంస్థల ప్రతినిధులు, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుస్థిరత నిపుణులు ఉన్నారు.
గత కొన్నేళ్లుగా సీఐఐ గ్రీన్ సిమెంటెక్, సిమెంట్ పరిశ్రమ సుస్థిర వృద్ధికి అవసరమైన డీకార్బనైజేషన్ మార్గాలు, డిజిటల్ పరివర్తన, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న సాంకేతికతలపై చర్చించడానికి ఒక వ్యూహాత్మక వేదికగా సేవలందిస్తోంది.

ప్రారంభోత్సవంలో ప్రతినిధులను ఉద్దేశించి గ్రీన్ సిమెంటెక్ 2026 కో-చైర్మన్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ మరియు చీఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్, ఈఆర్ రాజ్ నారాయణన్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో సిమెంట్ పరిశ్రమ పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సిమెంట్ పరిశ్రమ భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా, బలమైన మరియు సుస్థిరమైన మౌలిక సదుపాయాల ద్వారా వికసిత్ భారత్‌కు పునాది వేస్తోంది. గ్రీన్ సిమెంటెక్ 2026 థీమ్ ‘నెట్ జీరో కార్బన్ వైపు మార్గం'(Road towards Net Zero Carbon), ఇది నేడు భారతీయ సిమెంట్ రంగం వెళ్తున్న దిశను ప్రతిబింబిస్తోంది” అని పేర్కొన్నారు.

సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, నేషనల్ చైర్మన్, సి.శేఖర్ రెడ్డి… గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సుస్థిరమైన వస్తువుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఇలా అన్నారు: “గ్రీన్ బిల్డింగ్‌లు మరియు మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సిమెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. మన జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి తక్కువ కార్బన్ పదార్థాలను స్వీకరించడం చాలా ముఖ్యం. భారత్ అంతటా ఉన్న ఐజీబీసీ 32 ప్రాంతీయ విభాగాల ద్వారా మేం సుస్థిర పద్ధతులు, తక్కువ కార్బన్ నిర్మాణ పద్ధతుల ప్రాముఖ్యతపై ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, ఇంజినీర్లు, అర్బన్ ప్లానర్లు, కన్సల్టెంట్లు, విద్యార్థులలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం” అని పేర్కొన్నారు.

సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ వేస్ట్ టు వర్త్ టెక్నాలజీస్, చైర్మన్ మరియు రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసూద్ మల్లిక్ సిమెంట్ పరిశ్రమలో వనరుల పునర్వినియోగం గురించి నొక్కి చెబుతూ ఇలా అన్నారు: “సిమెంట్ పరిశ్రమ ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎక్కువగా స్వీకరించాలి. అలాగే వస్తువుల పనితీరును అర్థం చేసుకోవడం, వ్యర్థాలను వినియోగించుకోవడం మరియు కొలవగల ఫలితాలను ఇచ్చే సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రమాణాలపై దృష్టి సారించాలి.” అని అన్నారు.

సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ఇండియా, సెక్రటరీ జనరల్, అపర్ణ దత్ శర్మ.. కర్బణ ఉద్గారాలను తగ్గించడం, సుస్థిర వృద్ధిని సాధించడంలో పరిశ్రమకు ఉన్న ఉమ్మడి బాధ్యతను నొక్కి చెబుతూ ఇలా అన్నారు: “కర్బణ ఉద్గారాలను తగ్గించే విషయంలో పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సీఎంఏ వంటి సంస్థలు తమ సభ్యులు, సీఐఐ వంటి భాగస్వాములతో కలిసి ఇప్పటికే సిమెంట్ రంగంలో అర్థవంతమైన మార్పును తీసుకొస్తున్నాయి. విధానాలు, ఆవిష్కరణలు, పరిశ్రమల కార్యాచరణను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇది సాధ్యమవుతోంది.” అని వివరించారు.

గ్రీన్ సిమెంటెక్ 2026 ప్రధానాంశాలు:

కార్బన్ క్యాప్చర్: టెక్నాలజీస్, ఎకనామిక్స్ అండ్ స్కేల్-అప్ పాత్‌వేస్ అనే ప్రచురణను ప్రారంభించారు.
• సిమెంట్ పరిశ్రమ కోసం నెట్ జీరో వ్యూహాలపై సీనియర్ పరిశ్రమ నాయకులతో ప్యానెల్ చర్చలు జరిగాయి.
• సుస్థిరమైన సిమెంట్ తయారీ కోసం సరికొత్త, వినూత్న సాంకేతికతలపై సెషన్లు నిర్వహించారు.

గ్రీన్ సిమెంటెక్ 2026లో భాగంగా 50 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లతో ఒక ఎక్స్‌పో కూడా జరిగింది. ఇందులో ఇంధన సామర్థ్యం, ఉద్గారాల తగ్గింపు, స్మార్ట్ తయారీ రంగాలలో అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించారు. తక్కువ కర్బణ ఉద్గారాలు, బలమైన, డిజిటల్ పరంగా అభివృద్ధి చెందిన సిమెంట్ పరిశ్రమను నిర్మించాలనే సీఐఐ-జీబీసీ నిబద్ధతను చాటిచెబుతూ.. గ్రీన్ సిమెంటెక్ 2026 మే 15న మరిన్ని సాంకేతిక సెషన్లు, నాయకత్వ చర్చలు, ఎగ్జిబిషన్ సందర్శనలతో కొనసాగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *